ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులా? అంటే కొన్ని సార్లు అవును అనిపిస్తుంది. అది తెలుగు ఆడవాళ్ళ? భారతీయ స్త్రీలా? లేక ఎవరైనా కావచ్చా అంటే ఎవరైనా కావచ్చు అనిపిస్తుంది కొన్ని సార్లు. ఇది కేవలం నా అభిప్రాయం మరియు స్వానుభవం. ఇది నా చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనల ఆధారం గా రాస్తున్నాను.
మొదటి సంఘటన నేను స్కూల్ లో ఉన్నప్పుడు, మాకు కొంత మంది male టీచర్స్, కొంత మంది female టీచర్స్ ఉండేవారు. అందరూ కాకపోయినా కొంత మంది female టీచర్స్ మార్క్స్ తక్కువ వచ్చినందుకు అమ్మాయిలని ఎక్కువ తిట్టేవాళ్ళు....మాది పల్లెటూరు కావటం, నేను చదువుకున్నది govt . స్కూల్ కావటం తో, అమ్మాయిలు చాలా మంది ఇంట్లో పనులు చేసి, స్కూల్ కి వచ్చేవారు. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని తిట్టేటప్పుడు ఒక్కసారైనా, ఇంట్లో అంట్లు తోముకుని, వంట చేసుకో నీకు ఎందుకు స్కూల్ అని అనకుండా....ఒక్క female టీచర్ తిట్టటం ఆపేవారు కాదు. Volley బాల్ ఆడేటప్పుడు కూడా, బాల్ ని లిఫ్ట్ చేసేటప్పుడు అరచేయ్యికి తగిలిందా.....వెంటనే, పిడకలు చరిచినట్టు కాదు ఆడటం అంటే అనేది.
తరవాత, ఇంజనీరింగ్ చదివే రోజుల్లో, మా ఇంగ్లీష్ లెక్చరర్ అబ్బాయిలతో మాట్లాడేటప్పుడు ఎంతో సౌమ్యం గా, next paragraph నువ్వు చదువు నాన్న అనేది.....అమ్మాయిలని....నువ్వు చదువు అంటుంది అంతే. ఆవిడ same to same Happydays మూవీ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా చేసిన కమిలిని ముకర్జి లాగానే మాట్లాడుతుంది, నడుస్తుంది.....మూవీ చూసినప్పుడు ఆవిడనే చూసినట్టు ఉండేది నాకు.
ఇలాంటివి ఇంక ఒకటి రెండు చూసాను కానీ ఎప్పుడూ ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అని మాత్రం నేను ఇప్పుడు అనుకోలేదు. ఇంజనీరింగ్ అయ్యాక, మొదటి సారి ఒక కార్పోరేట్ కంపెనీ లో ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను. వ్రాత పరీక్ష, రెండు మౌకిక పరీక్షలు పాస్ అయ్యి, ఫైనల్ లెవెల్ ఇంటర్వ్యూ కి వెళ్ళాను. అక్కడ ఒక లేడీ ఉన్నారు. నేను ఏమి భయపడలేదు.....ఉద్యోగం నాకు ఇంక వచ్చినట్టే అన్నా కాన్ఫిడెన్సు తో ఉన్నాను. ఆవిడ నన్ను రెండే రెండు ప్రశ్నలు అడిగింది......ఒకటి క్లైంట్ కి సంబంధించినది.రెండవది నాకివ్వబోయే జాబు రోల్ గురించి. నాకు తెలుసున్నంతవరకు నేను బానే ఆన్సర్ చేసాను. కానీ జాబు రాలేదు. నేను చాలా భాద పడ్డాను. ఎందుకో తెలుసుకోవాలని ప్రయత్నించాను. చివరికి తెలిస్నది ఏమిటి అంటే, ఆవిడ అసలు వాళ్ల పై వాళ వరకూ నా కేసు వెల్లనివ్వకుండానే నా resume డ్రాప్ చేసేసింది. కారణం తెలియదు. మొత్తం ఆవిడ దగ్గరికి ఇంటర్వ్యూ కి వెళ్ళిన వాళ్ళం 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఆ ఒక్క అబ్బాయికి జాబు వచ్చింది.
తరువాత ౩ నెలలకి మరో పెద్ద MNC కి ఇంటర్వ్యూ కి వెళ్ళాను మళ్ళీ, ఇంటర్వ్యూ కి పిలిచినా వాళ్ళలో టాప్ 10 లో ఉన్నాను. ఇంటర్ వ్యూ pannels కూడా 8 ఉనట్టు ఉన్నాయి....నా ప్లేస్ 6 . అన్ని pannels విడివిడి గా ఒక్కొక్క అద్దాల గది లో ఉన్నారు. మొదట ఉన్న పది మంది ని random గా ఒక్కొక్కళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు....నేను మళ్లీ ఒక single లేడీ ఉన్న ప్యానల్ కి వెళ్ళాను. కొంచెం భయం వేసింది...మళ్ళీ ఇలా వచ్చాను ఏంటి అని, మొత్తానికి బానే చేసి బయటకి వచ్చి చూసేసరికి నా తరువాత ఆవిడ దగ్గరికి వెళ్ళటానికి ఒక Q ఉంది, మొత్తం 20 మందిలో, 3 అబ్బాయిలు. మిగతా అందరూ అమ్మాయిలే. నేను result కోసం వేచి చూడాలని అనిపించలేదు.....కానీ అసలు ఎంత మంది సెలెక్ట్ అయ్యారో చూడాలని ఉంటె, ౩ అబ్బాయిలు సెలెక్ట్ అయ్యారు....ఒక్క అమ్మాయ్ కూడా సెలెక్ట్ అవ్వలేదు. మిగతా pannels దగ్గర అమ్మాయిలు కూడా బానే సెలెక్ట్ అయ్యారు. నేను ఆ రోజూ మొదట సారి చిరాకు పడ్డాను.
తరువాత, మళ్ళీ USA వచ్చాక డ్రైవింగ్ లైసెన్సు కోసం వెళ్లి నప్పుడు, ఓ హో మన భారతీయులే కాదు, ఈ అమెరికన్లు కూడా దీనికి ఏ మాత్రం తీసిపోరు అనుకున్నాను. నాకు ఇండియా లో డ్రైవింగ్ వచ్చు. International permit కూడా ఉంది. కాబట్టి నేను రోడ్ టెస్ట్ ఇవ్వకుండానే లైసెన్సు పొందటానికి అర్హురాలిని. కానీ మళ్ళీ నా దురదృష్టం నన్ను వెంటాడి ఒక లేడీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను. నా పేరు పెద్దది అవ్వటం వల్ల నా పాస్ పోర్ట్ లో ఉన్న పేరు కి, నా డ్రైవర్స్ లైసెన్సు మీద పేరుకి కొంచం తేడా ఉండటం వల్ల ఆవిడ ఇండియన్ లైసెన్సు rejected అని రాసేసి, రోడ్ టెస్ట్ ఇవ్వమని చెప్పి పంపించింది. సరేలే నాకు వచ్చు కదా అనుకుని, వెళ్ళాను.....కానీ నా badluck అక్కడ కూడా లేడీ ఆఫీసర్ ఉంది....నేను రోడ్ టెస్ట్ ఫెయిల్..... కారణం 35 MPH రోడ్ లో 25 లో వెళ్తూ, ట్రాఫ్ఫిక్ న్యూసెన్స్ చేస్తున్నానని. మళ్ళీ నెల రోజుల తరవాత ఈ సారి ఇలా కాదు అని, వేరే DMV లొకేషన్ కి వెళ్ళాను.....రామేశ్వరం వెళ్ళినా శనీస్వరం పోలేదని, అక్కడ మళ్ళీ లేడీ ఆఫీసర్ సిద్దం, అప్పటికే, నేను సైకలాజికాల్గా భయం పెట్టుకున్న కారణం గా, కొంచెం వణుకుతూనే డ్రైవ్ చేసాను. మళ్ళీ ఫెయిల్....కారణం, stop sign దగ్గర complete స్టాప్ కి నేను రాలేదని, రోల్ ఓవర్ స్టాప్ అని.
ఇంక నాకు లైసెన్సు వద్దు అనుకుని, ఒక 2 నెలలు మళ్ళీ వెళ్ళలేదు. కానీ అవసరం కదా....తప్పక మళ్ళీ వెళ్ళిన రోజూ, ఒక లేడీ ఆఫీసర్ రెడీ గా ఉంది....అయ్యో భగవంతుడా, అనుకుంటుండగా, ఆమెకి ఫోన్ రావటం, ఆమె లోపలి వెళ్ళటం, వేరే ఆఫీసర్ రావటం జరిగి మొత్తానికి నేను టెస్ట్ పాస్ అయ్యి, లైసెన్సు తెచ్చుకునా....
తరవాత ఇంక ఎప్పుడూ, ఎక్కడికి వెళ్ళినా, అంటే షాప్ లోనో, పెట్రోల్ bunk లోనో, బ్యాంకు లోనో, చివరికి ఇండియా లో కర్రెంట్ బిల్ కట్టనికి, రైల్వే రిజర్వేషన్ కూడా, ఆడవాళ్ళూ ఉన్నదగ్గరికి అస్సలు వెళ్ళను.