3, మార్చి 2010, బుధవారం

Why "Dont Marry--Be Happy"




నిన్న మా వారు, వాళ్ళ ప్రాజెక్ట్ లో ఆఫ్ షోర్( ఇండియా) టీం లో ఒక మెంబెర్ తో ఫోన్ లో మాట్లాడుతూ, ఏంటి పెళ్లి చూపులకోసమా, అంటూ పెద్ద నవ్వు నవ్వి....అప్పుడే కంగారు ఏముంది....కొన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్ చెయ్యక...అంటుంటే, నాకు ఇంకా కొన్ని పాత విషయాలు గుర్తు వచ్చాయి. ఇలాంటి మాటలు ఇప్పటికి ఒక 100 సార్లు విని ఉంటాను నా పెళ్లి అయ్యాక....(3 years లో).


"వద్దురా సోదరా, పెళ్లి అంటే నూరేళ్ళ మంటారా..."
dont marry ....... be happy !!



అంటూ వచ్చే నాగార్జున పాటకి నవ్వుకుంటూ, rhythm కి తగ్గట్టు, కాళ్ళు, చేతులు tap చేస్తూ నేను కూడా ఎంజాయ్ చేస్తాను. కానీ అసలు నాకు ఒక డౌట్. నిజం గా పెళ్లి అయ్యాక, మగవాళ్ళంతా...అంతా అయ్యిపోయింది, కష్టాలు మొదలు అని ఎందుకు అనుకుంటారు, అసలు నిజం గా అనుకుంటారా...లేక ఉరికే ఫైఫైన కబుర్లా ఇవ్వన్నీ....


నాకైతే మాత్రం, ఇవ్వన్నీ ఉరికే చెప్పే మాటలులాగానే అనిపిస్తాయీ.....లేకపోతే, 28 ఏళ్ళు- 30 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా పెళ్లి అవ్వటం లేదు ( మోక్షం కోసం గృహస్థాశ్రమము స్వీకరించాలి కాబట్టి అని చెప్పదు.) అని ఎందుకు కంగారు పడిపోతారు? పెళ్లి కుదిరినప్పటి నుంచి కాబోయే శ్రీమతి తో రోజు అంతా ఫోన్ లో కబుర్లు చెప్పేస్తూ, వీలైనప్పుడల్లా సినిమాలకు, షికార్లకు చెక్కేస్తూ, ఉహాలోకం లో విహరిస్తూ ఉంటారు? 


పోనీ, నిజం గానే ఎంజాయ్ చేసే రోజులు పోయాయనే అనుకుందాము.....ఒక రకముగా నేను కూడా ఒప్పుకుంట, ఎందుకు అంటే, నేను పెళ్లి ముందు హాస్టల్ లో మా ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేసిన దాన్నే కనుక, ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్న, ఏమి చెయ్యాలన్న, ఎవరి పర్మిషన్ అవసరం లేకుండా( అంటే ఎప్పుడు  మాట వరసుకు అయినా మా వారికి చెప్తాను కనుక) జాలీ గా తిరేగేవాల్లము కాబట్టి.... కానీ పెళ్లి ముందు నేను నా రూం మేట్స్ తో ఎంత ఎంజాయ్ చేసానో, పెళ్లి కుదిరాక, పెళ్లి తరవాత కూడా మా వారితో అంతే ఎంజాయ్ చేసాను. కాకపోతే, మనం ఎంజాయ్ చేసే విధానం తేడా అంతే అని నా ఉద్దేశ్యం. 


ఈ మాత్రం దానికి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు అనగానే, ఈ మగవాళ్ళంతా అలా ఇలా జోకులు వేసేస్తారు.......

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

పెళ్ళి మనిషి జీవితంలో ఒక నూతన అంకానికి ప్రారంబం. సరదాలు వుంటయి, బాద్యతలు పెరుగుతాయి ఇద్దరికి. కాని, చిక్కు ఎక్కడంటే, భార్యభర్తలు బాద్యతలని సరిగా అర్థం చేసుకొలేక, ముందు జీవితమే బాగుంది అనుకొంటారు. అందరి జీవితాలలొ ఇది తప్పని పేజీ / phase.

Ramu Chennuri చెప్పారు...

adi pelli vishayame kadandi..manaki eppdu mana previous stage chaala baundedi anipisthadi...for example manam college days lo unnappdu school days are best ani...job lo ki vachaka college days best ani...marriage ayyaka bachelor life best ani

అజ్ఞాత చెప్పారు...

హలో!మీ పేరు తెలీదు.ఈ మధ్యనే ఒక రాత్రిపూట అనుకోకుందా మీ బ్లాగుని చూసాను.ఈనాడు వెతికి పట్టగలిగాను.మీ స్నేహితురాలి విషయం టూమచ్ గా వుంది.(సారీ)నేను మా అబ్బాయికి ఇప్పుడు పదేళ్ళు వచ్చినా ఇంకా జాబ్ కి వెళ్ళాలంటే స్కూల్ నుంచి వచ్చి ఒక్కడు వుండాలి,మరీ అవసరం లేదుకదా అని ఇంట్లోనే వుంటున్నాను.భర్త పాపని చూసుకొమంటే పోనీ అది కూడా ఒక వుద్యోగం అనుకొని చేయొచ్చును కదా.మీరు గట్టిగా మంచి బుద్ధి చెప్పి,అ చిన్నారి బాల్యాన్ని ఆస్వాదించమనండి.ఈరొజుల్లో అదీ ఒక అదృష్టమే.


అనూ

అజ్ఞాత చెప్పారు...

హలో!మీ పేరు తెలీదు.ఈ మధ్యనే ఒక రాత్రిపూట అనుకోకుందా మీ బ్లాగుని చూసాను.ఈనాడు వెతికి పట్టగలిగాను.మీ స్నేహితురాలి విషయం టూమచ్ గా వుంది.(సారీ)నేను మా అబ్బాయికి ఇప్పుడు పదేళ్ళు వచ్చినా ఇంకా జాబ్ కి వెళ్ళాలంటే స్కూల్ నుంచి వచ్చి ఒక్కడు వుండాలి,మరీ అవసరం లేదుకదా అని ఇంట్లోనే వుంటున్నాను.భర్త పాపని చూసుకొమంటే పోనీ అది కూడా ఒక వుద్యోగం అనుకొని చేయొచ్చును కదా.మీరు గట్టిగా మంచి బుద్ధి చెప్పి,అ చిన్నారి బాల్యాన్ని ఆస్వాదించమనండి.ఈరొజుల్లో అదీ ఒక అదృష్టమే.


అనూ

కామెంట్‌ను పోస్ట్ చేయండి