మొన్నామధ్య, మేము మా కుటుంబం మొత్తం అంటే మా అత్తగారు, మా వారి అన్నదమ్ములు ట్రైన్ లో ఎక్కడికో వెళ్లి తిరిగి వస్తున్నాం. మా అత్తయ్య గారు పాపం అలిసిపోయి పడుకున్నారు. నేను మా తోడికోడలు మాములుగా ఏవో కబుర్లు చెప్పుకుంటున్నాం. అన్నదమ్ములు మా కు ఎదురుగ ఉన్న బెర్త్ మీద కూర్చుని మా మాటలు విన్తునప్పటికి విన్నట్టు ఎటో చూస్తున్నారు. మా పెళ్లి పెళ్లి అయ్యాక అదే నేను మా తోడి కోడలితో తీరికగా మాట్లాడటం......(2 years తరవాత). మాటల మధ్యలో వంటల గురించి ఏదో మాట వచ్చింది.....అప్పటి వరకు మా మాటలు విననట్టు నటించే పెద్దమనుషులు మేము చేసే వంటల గురించి విమర్శించటం మొదలు పెట్టారు. తరవాత మా బావగారి అమ్మాయి (2 years ) గురించి, తనని మా తోడికోడలు ఎలా పెంచుతోందో......అవి ఇవి అన్ని ఇంచుమించు తన మీద కంప్లైంట్ లాగానే చెప్తున్నారు....వాళ్ళ( మా అత్తగారి) ఇంట్లో పిల్లల్ని ఎలా పెంచుతారు, ఈ అమ్మాయ్ ఎలా చేస్తుంది పనులు అవి ఇవి అన్నీ ఆమెకి వ్యతిరేకం గా నే చెప్తున్నారు. ఆయన మాట్లలోన్నే చెప్తాను నేను కూడా......" మన ఇంట్లో ఎంత జాగ్రత్త గా చుస్తామురా చిన్న పిల్లలు ఉంటె, వాళ్ళకి అన్ని టైం కి ఎలా చేసేస్తాము రా పనుల్నీ, అన్నం పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్త గా పెట్టాలి, మంచి నీళ్ళు తేడ చెయ్యకుండా అది ఎంత జాగ్రత్త గా చూడాలి" అంటూ ఏవో నాన్-స్టాప్ గా చెప్పు కుంటూ పోతున్నారు. నేను మా వారు ఏమి మాట్లాడతారో అని చూస్తున్నా....ఎందుకంటే, దానికి ఒక కారణం ఉంది.
మా అమ్మ వాళ్ళ ఊరు, మా వారి స్వస్థలం (అంటే వాళ్ళ అమ్మమ్మ, మామ్మ ల ఊరు) ఒకటే, అందువల్ల చాలా విషయాలలో, మావి ఒకటే పద్ధతులు, ఆచారాలు. వంటల అయితే, అస్సలు తేడాలేదు. మా అమ్మ చేసినట్టే, మా అత్తయ్యగారు కూడా చేస్తారు. కొంచం కూడా తేడ లేదు. దాని వల్ల నాకు పెళ్లి అయ్యాక పెద్ద ఇబ్బంది కలగలేదు. నేను చేసేవి, మా అత్తయ్యగారికి, మా వారికి అందరికి నచ్చుతాయి.కానీ నేను పుట్టి పెరిగింది పల్లెటూరులో, మా వారిది అంతా సిటీ లో.....ఇంకా పోతే, మా తోడికోడలు వాళ్ళ అమ్మ గారి పద్దతులు, మా అత్తయ్యగారి పద్దతులు పూర్తిగా వేరు. వంటలు దగ్గర్నుంచి......ముగ్గు పెట్టటం వరకు పూర్తిగా వేరు.
మా అత్తగారు ఇంట్లో, చాలా కూరలు, సాంబారు, పప్పు చారు వంటివి కొంచం తియ్యగా చేస్తారు, బెల్లం వేసి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంత తియ్యగా తినకపోయినా కొంచం వెయ్యటం అలవాటు ఉంది......దాని వల్ల నేను బానే అలవాటు పడ్డాను. పాపం మా తోడికోడలికి అస్సలు తియ్యదనం అలవాటు లేదు......తను తినలేకపోయేది. తను వండినప్పుడు వీళ్ళు తినలేకపోయేవారు. మా అత్తయ్యగారు కొత్త కదా అని ఏమి అనకపోయినా, బావగారు మాత్రం ఏదో ఒకటి అంటూనే వుండేవారు. తీపికి అలవాటు పడ్డ వాళ్ళు తీపి లేకుండా తినటం ఎంత కష్టమో, తీపి అలవాటు లేని ఈమె తియ్యగా తినటం అంతే కష్టం కదా......అది అర్థం చేసుకోరు.....ఎంత ఒకటే అలవాట్లు ఉన్నప్పటికీ నాకు కూడా కొన్ని విషయాలలో ఈ భాదలు తప్పలేదు. నేను పెళ్లి అయ్యాకనే మొదటిసారి గరిట పట్టింది, తిప్పింది. చపాతి చెయ్యటనికి బాగానే కష్టపడే దాన్ని. ఒక రోజు మా వారు అన్నారు, ఇవి చపాతీల, చపాతీలు కూడా పూరి లా పొంగాలి. మా ఇంట్లో చూడు ఎలా చేస్తుందో...మా .....(అమ్మ కాదు) అని. మా ---- అనబడే ఆవిడ 8 సంవత్సరాలుగా వంట చేస్తున్నారు. ఇంకా చపాతీలు కూడా....మరి నన్ను ఆవిడ చేసినట్టు చెయ్యమంటే ఎలా ? ఒక 6 నెలలకి నేను కూడా చేసి చూపించా మెత్తని పొంగే చపాతీలు. మా వారు ఎప్పుడైనా మా వాళ్ళ పద్దతులు, మా వదిన పద్దతులు అంటూ పోలిస్తే, నేను చెప్పేదాన్ని....అల ఎలా పోలుస్తారు మీరు.... మీరు పెరిగిన విధానం వేరు తను పెరిగిన విధానం వేరు కదా, కాబట్టి కొంత సమయం పడుతుంది తనకి ఇక్కడ adjust అవ్వటానికి......అని.....
మన పెద్దవాళ్ళు అత్తగారి పద్ధతులు ఎలా ఉంటె అలానే ఉండు నువ్వు కూడా అని చెప్పి పంపిస్తారు. కాబట్టి కోడళ్ళు నేర్చుకోవాలి అని వీళ్ళు అంటారు. 27 -28 ఏళ్ళు ఒకలా పెరిగాము, నీతో పెళ్లి అయ్యాక నా పద్దతులు మర్చుకోమంటే ఎలా అని మా వారు ఒక విషయం లో అన్నారు నన్ను. నేను కూడా కొన్నేళ్ళపాటు ఒకలా పెరిగి, పెళ్లి అయ్యింది, పెద్దవాళ్ళు అత్తగారింట్లో పద్దతులు అలవాటు చేసుకో అన్నారు కాదా అని రెండు మూడు రోజుల్లో నా అలవాట్లు మార్చుకోలేను కదా......అది వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు. పైగా, వీళ్ళ ఇంటి ఆడపిల్ల వేరే ఇంటికి కోడలి గా వెళ్లి, వాళ్ల అలవాట్లకి adjust అవటానికి ఇబ్బంది పడుతోంది అని చాల భాద పడిపోతారు. ఎంతో కష్ట పడి వాళ్లకి కావలిసినట్టు చేస్తోంది పాపం మన పిచ్చి పిల్ల అంటారు. కోడలు కూడా అంతే కదా.
అలా మా వారికీ నేను అస్తమానూ, చెప్పి చెప్పి ఆయన ఆలోచనా విధానం మార్చగలిగా అనుకున్న.....కానీ ఆయన ఏమి చేసారో తెలుసా, ఒకసారి మా అత్తగారు నన్ను ఉద్దేశించి, ఈ అమ్మాయి అన్నీ మా అమ్మాయిలానే బాగనే చేస్తుంది మా పద్దతుల్లో అంటే, మా వారు వెంటనే అలా అనకే అమ్మ, దానికి చాల కోపం అక్క తో పోలిస్తే అని అన్నారు.....నాకు ఏమనాలో అర్థం కాలేదు.....నేను చెప్పింది ఏంటి, ఈయన గారు అర్థం చేసుకున్నది ఏంటి.....
4 కామెంట్‌లు:
Anthe andi,magavallu alage artham chesukuntaru
మీవారు చాలా తెలివైనవారు.మరోసారి మీరు ఆయన దగ్గర మీగోడు వెళ్ళబోసుకోకుండా వుంటారని అలా చేసుంటారు.
మా ఇంట్లోకూడా ఇంతే, ఏదో మొగుడు కదాని కష్టం సుఖం చెప్పుకుంటామా. సమయం సందర్భం లేకుండా అది బయటపెట్టేస్తారు. పైగా .."అలా అయితే నాకు చెప్పకు నేను అడక్కుండా వూరుకోలేను " అంటారు . కడుపు చించుకుంటే కాళ్ళమిఏద పడుతుంది అంటారే ....అది ఇదేనేమో
@లలిత, మీరు చెప్పినది అక్షరాల నిజం. మా వారికి, మీరు చెప్పినట్టు ఈ రకమైన తెలివితేటలూ చాలా ఉన్నాయి. మ్చ్.........
@అజ్ఞాత గారు, మీరు ఎక్కోడో రాయాలనుకున్న సచిన్ భారత రత్న కామెంట్ ఇక్కడ రాసారని తలుస్తూ, తొలగిస్తున్నాను.....
కామెంట్‌ను పోస్ట్ చేయండి