4, మార్చి 2010, గురువారం

నా గురించి.....నాలో నేను.....-1

ఈ రోజు ఏమి రాయాలో నిశ్చయించుకున్నా కానీ, ఎలా మొదలుపెట్టాలో తెలియటం లేదు. 

నాకు చినప్పటి నుంచి తెలుగు అంటే ఇష్టం, ఏవో చందమామ కథలు, బొమ్మరిల్లు కథలు, అవి ఇవి చదివే  దాన్ని కానీ ఎప్పుడూ నవలలు,కవితలు అవి చదవలేదు. రోజు దినపత్రిక మాత్రం బాగా చదివేదాన్ని. పొద్దున్నే మా అమ్మ ఇచ్చిన Bournvita పట్టుకుని తాగుతూ పేపర్  చదివే దాన్ని 7th క్లాసు అప్పటినుంచి. పెళ్లి ముందు వరకు అదే దినచర్య పేపర్ విషయం లో, కానీ పెళ్లి అయ్యే అమెరికా వచ్చాక చాలా రోజుల వరకూ, నాకు పేపర్ చదవటం కుదరలేదు. అసలు online లో ఉంటుంది( తెలుగు పేపర్) అని కూడా తెలియదు. తెలిసాక చదవటం మొదలుపెట్టా, కాకపోతే evening చదివేదాన్ని( అప్పుడే కదా పేపర్ update అవుతుంది). మొదట్లో మా ఇద్దరికి ఒకటే లాప్-టాప్ ఉండేది. అప్పుడు కుదిరేది కాదు. తరవాత మా వారు నాకు ఒక లాప్-టాప్ కొని ఇచ్చారు. అప్పటి నుంచి మళ్ళి చిన్నప్పుడు చదివినట్టే చదవటం మొదలు పెట్టాను. మా వారు ఎప్పుడు ఏమి అనలేదు. ఆయాన తెలుగు చదవలేరు. ఒక వాక్యం చదవటానికి కనీసం 2 min తీసుకుంటారు ఇప్పటికి.

ఒకసారి మా వారి ప్రాణస్నేహితుడు ఫోన్ చేసాడు. ఫోన్ స్స్పీకర్ ఆన్ చేసి ఉంది.మాములుగా అవి ఇవి మాట్లాడుకుంటున్నారు. ఈ లోపు మా వారు నాకోసం లాప్-టాప్ కొన్నట్టు చెప్పారు. అప్పుడు వాళ్ళ స్నేహితుడు, అయితే ఎమైన కోర్సు చేస్తోందా అని అడిగాడు. మా వారు ఏమి లేదు అని చెప్పారు. మరి ఎందుకు కొన్నావ్ అంటాడు అతను. ఉరికే పాపం బోర్ కొడుతుంది కదా ఇంట్లో అందుకు అన్నారు ఈయన. తనకి పేపర్ చదివే అలవాటు ఉంది, ఒక్క లాప్-టాప్ తో కుదరటం లేదు అని చెప్పారు. అప్పుడు అతను అన్నాడు, నువ్వు అంతా పెట్టి లాప్-టాప్ కొని ఇచ్చింది పేపర్ చదవటానికా అన్నాడు...వెంటనే స్పీకర్ ఆఫ్ అయ్యిపోయింది. తరవాత మా వారి మాటలు, ఆయన ముఖ భావాలు చూసి నాకు అర్థం అయ్యింది....ఇంకా ఏవో అలానే మాట్లాడుతున్నాడు అని.

తెలుగు పేపర్ చదివితే ఏమి వస్తుంది. ఇంగ్లీష్ పేపర్ చదవు. లాంగ్వేజ్ కూడా బాగా improve అవుతుంది. ఉరికే అవి ఇవి అని టైం వేస్ట్ చెయ్యకు. ఏదైనా కోర్సు చెయ్యి, జాబు చెయ్యి అంటాడు. (కొన్ని  వ్యగ్తిగత  కారణాల వాళ్ళ నేను జాబు చెయ్యటం లేదు) ఇప్పటికి అతనికి నేను అంటే చుకలన భావం ఉంది. జాబు చెయ్యనని, ఎప్పుడు తెలుగు పేపర్, తెలుగు కథలు అంటానని.....నాకు అప్పుడప్పుడు చాలా భాద వేస్తుంది. అతనితో మాట్లాడాలన్న,వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్న నాకు ఎందుకో భయం. వాళ్ళు భార్యభర్తలిద్దరూ జాబు చేస్తారు. ఆ అమ్మాయ్ కూడా నన్ను కొంచం చులకన గానే చూస్తుంది. నేను ఎప్పుడైనా అవసరం అయ్యి ఫోన్ చేసినా తియ్యదు, మళ్ళి ఫోన్ చెయ్యదు. మెయిల్ చేసినా రిప్లై ఇవ్వదు. వాళ్ళు బిజీ గా ఉంటారు ఆఫీసు పనులతో, నేను ఇంట్లో ఖాలీ గా పని ఏమి లేక ఫోన్ చేస్తున్న అనుకుంటుందేమో మరి. కనీసం మెయిల్ కి రిప్లై కూడా ఇవ్వదు....రిప్లై ఇవ్వటం ఎంత సేపు చెప్పండి. మహా అయితే 2 - 5  నిమిషాల పని.  నాకు ఒక విషయం అర్థం కాదు, నేను వాళ్ళ లాగానే చదువుకున్న, ఇంగ్లీష్ మాట్లాడగలను, అన్నీ పనులు చెయ్యగలను, కేవలం ఒక్క జాబు చెయ్యను అందుకని అంత చులకన భావం ఎందుకు? ఒక్కొక్కసారి అనిపిస్తుంది.....జాబు తెచ్చుకుని చెయ్యకుండా మానేద్దాం అని, కానీ ఇది అమెరికా అయ్యిపోయింది. జాబు ట్రై చెయ్యటానికి కూడా వీసా కావలి కదా. మా వారితో చాలా సార్లు
చెప్పాను నాకు అతని మాటలు కొంచం ఇబ్బంది కరంగా ఉన్నాయి అని, కానీ పాపం ఆయన ఏమి చేస్తారు. ప్రాణస్నేహితుడు......

ఒకసారి, మేము వాళ్ళ ఇంట్లో ఉనప్పుడు ఆ అబ్బాయ్ వాళ్ళ తల్లితండ్రులు ఫోన్ చేసారు ఇండియా నుంచి, మా వారు మాట్లాడారు, వాళ్ళ నాన్న గారు నాతో మాట్లాడతా అన్నారు, నేను నాకు ఇష్టం లేకుండానే మాట్లాడాను. ఆయన  కుశల వార్తలు అడిగాక, ఏమి చదువుకున్నావ్ అని అడిగారు, నేను
చెప్పాను. మరి జాబు చేస్తున్నావా అన్నారు, లేదండి అన్నా, ఎందుకు అన్నారు.....ఏమి చెప్పను నేను..... తర్వాత ఒక సంవత్సరం తరువాత , మేము ఆ అమ్మాయ్ వాళ్ళ తల్లితండ్రులను కలుసుకోవటానికి వెళ్ళాల్సి వచ్చింది ఇండియా లో, మళ్ళి కథ మాములే, వాళ్ళ నాన్న గారు ఏమ్మా ఏమి చదివించారు నిన్ను మీ నాన్నగారు అని అడిగారు, నేను చెప్పాను. మరి ఉద్యోగ ప్రయత్నం ఎంత వరకూ వచ్చింది అన్నారు. ఈ లోపే వాళ్ళ అమ్మ గారు, ఆ అమ్మాయ్ చెయ్యదట, మన అమ్మాయ్ చెప్పింది అన్నారు.  ఆయన తరువాత ఆ మాట ఈ మాట చెప్పి, నాకు అసలు ఇంట్లో ఉరికే కూర్చున్నే వాళ్ళు అంటే ఇష్టం ఉండదు. ఏదో ఒక పని చెయ్యాలి....వంట పని ,ఇంటి పని అందరు చేస్తారు, అదీ కాకా ఇంకా ఏమైనా చెయ్యి అన్నట్టు చెప్పారు......నేను ఇంక ఒక్క నిమిషం అక్కడ ఉండలేకపోయాను. వాళ్ళ వయస్సు  కి ఇచ్చిన గౌరవంవల్ల ఏమి సమాధానం చెప్పకుండా....చిన్న నవ్వు నవ్వి వచ్చేసాము. నాకు అప్పుడప్పుడు మా వారి మీద కోపం వస్తుంది....ఈయనైనా వాళ్ళకు చెప్పచు కదా.... 

ఇవి అన్నీ రాస్తూ ఉంటేనే, నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఈ రోజుకి ఇంక రాయలేను.....మళ్లీ ఎప్పుడైనా మిగతావి చెప్తాను.

బాగా చదువుకుని, అమెరికా లో ఉండి, ఉద్యోగం చెయ్యక పోవటం నిజం గానే ఏమైనా తప్పా? తెలుగు మీద ఉన్న ఇష్టం తో తెలుగు పేపర్ చదవటం తప్పా?

9 కామెంట్‌లు:

మంచు చెప్పారు...

'House maker' is the best job in the world.

చదువు విజ్ఞానాన్ని , సంస్కారాన్ని నేర్పించేది.. చదివితే వుద్యొగం చెయ్యలని ఎమీ లేదు.... ఎవరిస్టం వారిది..

Friend చెప్పారు...

ఏమండి..చాలా రోజులకు నన్ను నేను మీలో చూసుకున్నట్లు ఉంది..నేను కూడా హెచ్ 4 వీసా మీద ఉన్నాను. ఉద్యోగం చేయటానికి అనుమతి లేదు. సహజం గా తెలిసిన వాళ్ళందరూ..తెలియని వాళ్ళు కూడా ఎందుకు ఉద్యోగం చెయ్యట్లేదు అని అడుగుతారు. నాకు అనుమతి లేదండి అని చెబితే పోనీ ఏదైనా చదువు..ఊరికినే ఇంట్లో కూచుంటే ఏమి వస్తుంది అని సలహా చెప్పబోతూంటారు. సరే..చెపితే చెప్పనీ..వినదగునెవ్వరు చెప్పిన అనుకుని మొదట్లో ఊరుకునేదాన్ని..ఇక రాన్రాను..మనకు ఏది మంచో ఏది కాదో..మనకున్న లిమిటేషన్స్ ఏమిటో..మన పరిస్థితులేంటో మనకు తెలియదా..అవకాశం దొరికితే చాలు లెక్చర్ దంచటానికి రెడీ గా ఉంటారు అనుకుని ఇలా కాదు కాని కూసంత గడుసుగా ఉండటం అనేది అవసరం .. అనుకుని కొన్నిసార్లు ..అహ..అయితే నేను ఏమి వచ్చంటారు..నాకు ఏమేమి అవకాశాలుంటాయి..మీరు ఏమి చదివితే మీకు వచ్చాయి అంటూ ఊపిరాడకుండా ప్రశ్నలు వేసేయటం నేర్చుకున్నాను. కాని ఇపుడు దానితో కూడా విసుగొచ్చింది. వాళ్ళ స్థాయికి మనం దిగజారి మాట్లాడితే మనకు వారికి తేడా ఏముంది..అది తప్పు అని గ్రహించాను. అసలు అలా ఎదుటి మనిషిలోని అభిరుచులను గౌరవించక నీచం గా చూసేవారి గురించి పట్టించుకోవటం శుధ్ధ వేస్ట్..చెప్పటం వీజీనే అనుకోండి..కాని మీ మనసెంత బాధ పడుతుందో గ్రహించాక .. ఒక ఫిలాసఫీ చెప్పాలనిపించింది. అసలు మనల్ని మనం ఎవరితో కంపేర్ చేసుకోకూడదండి. ఎవరి జీవితం వారిది. ఎవరి ఇష్టాలు వారివి. పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నాయి. అన్ని ఉన్న రోజున మా అంత వారు లేరు అని విర్రవీగే వాళ్ళు కూడా పాఠాలు నేర్చుకునే రోజులు వస్తాయి. వారి సంగతి మీకెందుకు గాని..బంగారం లా మీ ఇష్టాఇష్టాలని మీరు గౌరవించుకుంటూ మీ ముచ్చట్లు మురిపాలు మీరు తీర్చేసుకోండి. అసలు మళ్ళీ ఈ సమయం రాదు..ఎవరైనా ఏమైనా అన్నా నవ్వి కొట్టిపడేయటం అలవాటు చేసుకోండి. మనకు సరిపడనిది ఏదైనా ఆమడ దూరం లో ఉంచటం అనేది మన చేతిలోనే ఉంది సుమీ..:)అన్నట్లు నేను కొన్నాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో అనిభవమన్నా వస్తునదని వలంటరీ గా జాబ్ చేసాను. వారికి నా పని నచ్చి హెచ్ 1 ప్రాసెస్ చేసారు. కాని దురదౄష్టవంతుడు ఒంటెమీద కూచున్న దాబర్మాన్ కుక్క కరిస్తుందట..అలాగే ఆ టైం లోనే ఎకానమీ పడిపోవటం మూలానా .. ..చివరకు ప్రాసెస్ పూర్తి అయ్యి హెచ్ 1 పేపర్స్ చెటికి వచ్చే లోపే కంపెనీ హరీ అంది..ఆ కంపెనీ దివాలా తీసింది. చేటిలో హెచ్ 1 ఉన్నా ఉద్యోగం ఇచ్చే కంపెనీ లేదు..సో కొన్ని పరిస్థితులకు కారణం మనకు సమర్ధత లేదు అనుకోవటం లోకుల పిచ్చితనం..అవన్ని నమ్మాల్సిన అవసరం మనకుందంటారా,,మీరన్నట్లు ఉద్యోగం తెచ్చుకుని వదిలేసిన సందర్భాలు ఎన్నో..:)

గుప్పెడు మనస్సు చెప్పారు...

అభిజ్ఞాన గారు, బాగా చెప్పారు......మీరు అన్నట్టు....నేను ఇప్పుడు వాళ్ళని పట్టించుకోవటం లేదు.....నాకంటూ నాకు నచిన ఒక ప్రపంచం ఏర్పాటు చేసుకుని....బానే ఉన్నాను....కానీ అప్పుడప్పుడు కొన్ని విషయాలు వద్దు అనుకున్నా గుర్తు వచ్చి భాద పడతాను.......

Raj చెప్పారు...

గుప్పెడుమనసు గారు,
ఈ చులకన భావం ఎలా మొదలవుతుందో చూడండి..
సైకిల్ మీద వెళ్ళె వాడికి నడిచి వెళ్ళెవాడంటే చులకన...అలాగే బైక్ వున్నవాడికి సైకిల్ వాడంటే..
అలాగే ...అమెరికాలో హెచ్ 1 మీద వెళ్ళిన వాడికి ఎల్ 1 అంటే చులకన..ఎల్ 1 వాడికి బి 1 అంటే..
బి 1 వాడికి ఇండియాలో పనిచేసేవాడంటే ..
అయినా ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పెద్దలు ..హాయిగా ఇంట్లో కూర్చొని పిల్లలని మంచిగా తీర్చిదిద్దటం వల్ల వచ్చే ఆనందం ఆఫీసుల్లో పనిచేస్తే వస్తుందా?..
Dont bother about others..Enjoy..

చెప్పాలంటే...... చెప్పారు...

meru valla comments gurinchi patttinchukokandi. Meku nachinatlu meru vuntunnaru vallakenduku?Eamee ledu vallaku meelaa vundatam cheta kaaka ala eadustunnaru ante.Housewife job ki 24 hours kudaa chaladu time.Nenu Akkada vunnappudu entlo vunte assalu khali vundedi kadu job ki velte time dorikedi.Antha khali lekundaa job lo eami chestaaro andariki telusu ...America lo job chesa valla job eala vuntundo telusu.Maa todikodalu vundi elantide daaniki english matladatam kuydaa raadu anni nerpinchi job ki pampiste daani goppe ani cheptundi.....

అజ్ఞాత చెప్పారు...

చదువు విజ్ఞానం కోసం అనేది పాత మాటయిపోయిందండీ. ఇప్పుడు అన్నీ డబ్బుకోసమే . చేతిలో దీపం వుండేది ఎప్పుడయినా చుట్టూ చీకట్లు కమ్ముకుంటే మార్గం చూపించడానికి. దీపం వుందనే అహంకారంతో వెళ్ళి చీకట్లో కూర్చోమని కాదు. అవసరం లేకున్నా ఆడంబరం కోసం వుద్యోగం చెయ్యటం కంటే ఆశక్తి కి తగ్గ పనిని ఆనందంగా చెయ్యటమే వుత్తమం. మీరు చేసేది నూరుపాళ్ళూ సరైనదే.
మీరు చెప్పిన వాళ్ళంతా తమ ఆనందంకోసం కాక సమాజంలో గుర్తింపు కోసం తాపత్రయ పడుతున్నవాళ్ళూ. వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా మీ ఆనందం కోసం మీరు జీవించండి .

గుప్పెడు మనస్సు చెప్పారు...

@రాజ్ గారు,
@చెప్పాలంటే గారు,
and @లలిత గారు.....

మంచి మాట్లలు చెప్పి నాకు కొంత స్వాంతన కలిగించినందుకు థాంక్స్.

భావన చెప్పారు...

మీరు బలే వున్నారే. ఇలా అందరిని పట్టించుకుంటే బతికినట్లే అమెరికా లో. Take it easy. లలిత గారన్నట్లు వుద్యోగం డబ్బు కోసం అంతే అంతకు మించి ఏమి లేదు ఇక్కడ. అస్సలు పట్టించుకోకండి.

kiranmayi చెప్పారు...

మీరు మరీను. మీకు ఇష్టం అయితే చేస్తారు లేక పోతే లేదు. నాకు అర్ధం అయ్యింది మీ బాధ. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు సంజీవరెడ్డి నగర్ లో ఉద్యోగం చేసేదాన్ని. మా ఇల్లేమో నారాయణగూడ లో. దాదాపు ఓ అరగంట బస్సు ప్రయాణం (కరెక్ట్ టైం లో బస్సు దొరికితే, లేదంటే గంట సేపు బస్సు స్టాప్ లోనే). పొద్దున్న ఎనిమిది గంటలకి ఇంట్లోంచి మా అమ్మ తో బాటు బయట పడితే, (మా అమ్మ కూడా జాబు చేసేది) సాయంత్రం ఎ అయిదు న్నరకో ఇంటికొచ్చేదాన్ని. అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు కాబట్టి ఇంటికి రాగానే అమ్మ టిఫిన్ పెట్టేది హాయిగా కాబట్టి నాకు నొప్పి తెలీలేదు. మా అమ్మా, నాన్న నా గురించి గొప్ప చెప్పుకునే వాళ్ళు చాలా కష్ట పడుతుంది కెరీర్ కోసం అని. అది విని ఒక రోజు మా కజిన్ అంది నాతో "అబ్బ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎలా ఊర్లమ్మట తిరుగుతారు మీరు? ఎంతైనా మీలాంటి సిటీ అమ్మాయిలకి షోకులేక్కువే బాబు" అని. నాకు తెలుసు షోకుల కోసం తిరుగుతున్నానా, లేక నాకంటూ ఒక వ్యక్తిత్వం, individuality ఉండాలని, కెరీర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి పాటుపడుతున్నానా అన్న సంగతి. వేరే వాళ్ళ పనుల్లో తప్పులెన్నే జనాలకి, అవతలివాళ్ళు ఉద్యోగం చేస్తున్నారా, చెయ్యట్లేదా అన్నది ముఖ్యం కాదండి. వాళ్లకి అదును దొరికితే ఎ విషయం అయినా తప్పులు పట్టేస్తారు. మీరు అనవసరంగా ఫీల్ అవ్వకండి. మీ జీవితం మీఇష్టం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి