11, మార్చి 2010, గురువారం

నా స్నేహితురాలు - 1

పల్లవి, నా ఫ్రెండ్ కీర్తన కూతురు. ఇప్పుడు దాని వయస్సు (పల్లవి) రెండున్నర సంవత్సరాలు. కీర్తన పెళ్లి ముందు, పెళ్లి తరవాత తను చదువుకున్న కాలేజీ లోనే లెక్చరర్ గా జాబు చేసేది. డెలివరీ ముందు మానేసింది. మళ్లీ జాయిన్ అవ్వాలని అనుకున్నా, పాపతో కుదరలేదు. కీర్తన భర్త ఒక కార్పోరేట్ ఆఫీసు లో మంచి ఉద్యోగం లో నే ఉన్నాడు. మంచిది అంటే వాళ్ళకి సరిపోతుంది. వాళ్ళు ముగ్గురు తృప్తి గా బతకచ్చు. కీర్తన తల్లి తండ్రులు, అత్తమామలు, కీర్తన వాళ్ళు అందరు ఒకే కాలనీ లో ఉంటారు. ముందు కీర్తన వాళ్ళు, అత్తమామలు కలిసే ఉండేవారు, అత్తమామలు ఇద్దరు govt . ఉద్యోగస్తులు. కాబట్టి వాళ్ళు రోజూ ఆఫీసు పనులతో బిజీ. కీర్తనకేమో ఉద్యోగం చెయ్యాలని. ఇంట్లో ఉండటం అస్సలు ఇష్టపడదు. అందులోనూ, కీర్తన చాలా గారాభంగా పెరిగింది. కీర్తన తల్లి కీర్తనని ఒక్క పని కూడా చెయ్యనివ్వదు. కానీ అత్తగారింట్లో చెయ్యాల్సి వస్తుంది కదా. అందులోను, అత్తగారు ఆఫీసు కి వెళ్లి వస్తారు. పొద్దున్న, సాయత్రం ఆవిడే వంట చేస్తారు. కీర్తన చెయ్యాల్సిందల్లా, అవసరమైతే, కూరలు తరిగి ఇవ్వటం, ఇంకా పని అమ్మాయ్ కడిగిన గిన్నెలు సర్దటం లాంటి పనులు. కానీ కీర్తనకి ఆ పనులు చేస్తూ, పిల్లని చూసుకోవాలంటే కొంచెం కష్టం గా ఉండేది. ఇంట్లో ఉండి కూడా కీర్తన పెద్దగా ఇంటి పనులు పట్టించుకోకపోవటం వల్ల అత్తగారు కొంచం అసంతృప్తిగా ఉండే వారు. దాని వల్ల కొంచం కోల్డ్ వార్ జరుగుతూ ఉండేది. ఈ లోపు పల్లవి కి 1 సంవత్సరం నిండింది. కీర్తన ఒక రోజు భర్త ని ఒప్పించి, మళ్ళీ ఉద్యోగం చెయ్యటానికి నిశ్చయించుకుంది. కానీ పాప ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు అని డే కేర్ లో పెట్టానికి మాత్రం భర్త ఒప్పుకోలేదు. అప్పుడు మొదలు అయ్యింది సమస్య. ఇంకా కొన్ని ఇతర ఇబ్బందులు ఉన్నాయి అని కారణం చెప్పి, వేరింటి కాపురం పెడదామని భర్తని అడిగింది. కీర్తన గోల భరించలేక, అమ్మ నాన్నలని భాద పెట్టలేక.....సతమత మవుతున్న కొడుకుని చూసి, అత్తమామలు వేరింటి కాపురం పెట్టుకో మన్నారు. సరిగ్గా వీళ్ళ ఇంటికి, కీర్తన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి మధ్యలో ఇల్లు తీసుకుని ఉంటున్నారు ఇప్పుడు.


ఇంక కీర్తన తన ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పల్లవి ని వాళ్ళ అమ్మగారు దగ్గర వదిలి ఇంటర్వ్యూ లకు, కోచింగ్ లకు తిరిగేది......ఎందుకో కానీ, పల్లవి అమ్మమ్మ దగ్గర ఉండలేకపోయేది. సాయంత్రం వాళ్ళ నాన్నే ముందు వచ్చేవాడు ఇంటికి. ఆయన రాగానే, బాగా ఏడ్చి పట్టుకుని వదిలేది కాదు. పల్లవి చాలా బెంగ పెట్టుకుంటోంది, అన్నం అది తినటం లేదు అని నెమ్మదిగా ఆయనకి అర్థం అయ్యింది. ఆయన కీర్తన కి అర్థం అయ్యేలా చెప్పి చూసాడు, కానీ కీర్తన ఇంట్లోనే ఉండి పిల్లని చూసుకోవటానికి సుముఖంగా లేదు. కానీ కీర్తన తల్లి తండ్రులు కీర్తన ఏమి అన్నా, సై అనేవారు. అలా , గొడవలు పడుతూ, ఒక సంవత్సరం గడిపారు. ఈ సంవత్సర కాలం మొత్తం, కీర్తన తన ఉద్యోగ ప్రయత్నాలలో, వాళ్ళ ఆయన కీర్తనకి నచ్చ చెప్పే ప్రయత్నాలలో ఉన్నారు. ఇద్దరు సక్సెస్ అవ్వలేదు. కీర్తన అన్నయ్య వాళ్ళు కూడా కీర్తన అమ్మ నాన్న లతో కలిసి ఉంటారు. వాళ్ళకి ఒక పాప. పల్లవి కన్నా 8 నెలలు పెద్దది. ఆ పాప ని వాళ్ళు ప్లే స్కూల్ లో జాయిన్ చేసారు. కీర్తన, పల్లవి ని కూడా జాయిన్ చేద్దాం అంది. కానీ కీర్తన వాళ్ళ ఆయన, కీర్తనని ఉద్యోగ ప్రయత్నాలు మానిపించాలని వద్దు, నువ్వు ఇంట్లో నే ఉండి చూసుకో ఇంకో సంవత్సరం, అప్పుడు జాయిన్ చేద్దాం అన్నారు. కానీ కీర్తన మళ్ళీ పట్టు పట్టి వాళ్ళ ఆయనకీ చెప్పకుండా, తెలియకుండా, రోజు కాసేపు ప్లే స్కూల్ లో వదిలి వస్తోంది. ఒక నెల రోజులకి విషయం భయటపడింది. ముందు కోపం వచ్చినా, నెమ్మదిగా సర్దిచెప్పాలనుకున్న కీర్తన భర్త ప్రయత్నం ఫలించలేదు. ఇంక లాభం లేదు అని ఒక రోజు గట్టిగా గొడవ పడ్డారు. నెమ్మదిగా కీర్తన తల్లితండ్రులకి అర్థం కాసాగింది, వాళ్ళు వంత పాడి ఎంత తప్పు చేస్తున్నారో, కానీ ఇప్పుడు ఇంక ఏమీ చెయ్యలేరు.

ఈలోపు ఇంకో 2 ,3 నెలలు గడిచాయి. అంటే పల్లవి వయస్సు ఇంచు మించు 2 సంవత్సరాల 4 నెలలు. పల్లవి కి అక్షరాభ్యాసం చేసేస్తే, తొందరగా స్కూల్ కి పంపించచ్చు అనుకుందేమో నాకు సరిగ్గా, తెలియదు కానీ, కీర్తన అక్షరాభ్యాసం చేసేద్దాం అని చెప్పింది. అప్పుడే ఎందుకు అని అత్తగారు వాళ్ళు వద్దు అని చెప్పారు. మళ్ళీ గొడవ మొదలు. కీర్తనేమో, నేనేమి చెప్పినా, అత్తయ్యగారు వాళ్ళు కాదు అంటారు, దానికి మా ఆయన కూడా వంత పాడతారు అంటూ, నాకు చెప్పింది. నేను కూడా చెప్పి చూసాను, ఇంకో 6 నెలలు ఆగు. అప్పుడు చేద్దువులే అని, నామీద కూడా కోపం తెచ్చుకుని వెళ్లిపోయింది. మొత్తానికి కీర్తన గోల భరించలేక, వసంత పంచమికి భాసర లో అక్షరాభ్యాసం చెయ్యాలని నిశ్చయించుకున్నారు. ముహర్తం అది చూడకుండానే అన్ని ఏర్పాట్లు చేసేసారు. ఇంట్లో కారు కాకుండా ఒక కాబ్ కూడా బుక్ చేసారు. ఇంకో 4 రోజులు ఉందీ అనగా, కీర్తన అత్తగారికి, వాళ్ళ శాస్త్రి గారు కనిపించి, ఇప్పుడు మూడమి అమ్మా, 4 నెలలు ఆగండి, అని చెప్పారు. ఆయన వద్దు అన్నాక ఎందుకు లే ఆగుదము అని అనుకున్నారు. మళ్ళీ కీర్తన ఏమి అంటుందో, అని భయపడుతూ చెప్పారు. మీకు ఇష్టం లేదు అందుకనే, ఆయనతో చెప్పించారు అని దెబ్బలాడింది. ఏది ఏమైనా జరిగి తీరాలని కీర్తన, వద్దు అని వాళ్ల ఆయన.....కీర్తనకి నచ్చచెప్పే ప్రయత్నం లో కీర్తన తల్లి తండ్రులు, అత్తమామలు...... ఇంతలో, వసంత పంచమి నాడు, ఆ తరువాత రోజూ తెలంగాణా జిల్లాలలో ప్రత్యేక తెలంగాణా కోసం బంద్. కాబట్టి వెళ్ళటం అంత మంచిది కాదు అని అందరు చెప్పారు. అయినా ట్రై చేద్దాం అంది కీర్తన. కీర్తన వాళ్ల అమ్మ వాళ్ల డ్రైవర్ నేను రాను, మానేద్దాం అమ్మ అని చెప్పాడు. ప్రైవేటు కాబ్ వాడు నేను రాను అని చెప్పేసాడు. ఇంక చేసేది లేక ప్రోగ్రాం మొత్తం కాన్సిల్ చేసారు.

కానీ, అత్తా గారు వాళ్ళు ముందు నుంచి వద్దు అన్నారు. ఏదైనా పని మొదలు పెడుతుంటే, వద్దు అనకూడదు, పెద్దవాళ్ళు అయ్యి ఉండి కూడా అలా అన్నారు, అందుకే ఇలా జరిగింది అంటూ, మా కీర్తన అత్తగారి తో మాట్లాడటం మానేసింది. ఇప్పటికి 2 నెలలు అయ్యింది. ఇంకా వాళ్ళతో మాట్లాడటం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళటం లేదు. పల్లవి ని కూడా పంపించటం లేదు. ఎందుకు నీకు అంత పట్టుదల, నువ్వే తప్పు చేస్తున్నావ్ అంటే వినదు. దాన్ని ఎలా మార్చాలో అర్థం కావటం లేదు....







6 కామెంట్‌లు:

Anoo చెప్పారు...

హలో!మీ పేరు తెలీదు.ఈ మధ్యనే ఒక రాత్రిపూట అనుకోకుందా మీ బ్లాగుని చూసాను.ఈనాడు వెతికి పట్టగలిగాను.మీ స్నేహితురాలి విషయం టూమచ్ గా వుంది.(సారీ)నేను మా అబ్బాయికి ఇప్పుడు పదేళ్ళు వచ్చినా ఇంకా జాబ్ కి వెళ్ళాలంటే స్కూల్ నుంచి వచ్చి ఒక్కడు వుండాలి,మరీ అవసరం లేదుకదా అని ఇంట్లోనే వుంటున్నాను.భర్త పాపని చూసుకొమంటే పోనీ అది కూడా ఒక వుద్యోగం అనుకొని చేయొచ్చును కదా.మీరు గట్టిగా మంచి బుద్ధి చెప్పి,అ చిన్నారి బాల్యాన్ని ఆస్వాదించమనండి.ఈరొజుల్లో అదీ ఒక అదృష్టమే.


అనూ

గుప్పెడు మనస్సు చెప్పారు...

అనూ, మీరు చెప్పినట్టు ఈ రోజులలో పిల్లల్ని మనం దగ్గరుండి, పెంచుకోవటం అనేది నిజంగానే అదృష్టం. నా చిన్నప్పుడు మా క్లాసు లో ఎవరి అమ్మ అయినా జాబు చేస్తుంటే, చాలా గొప్పగా చెప్పే వాళ్ళు.....ఈ రోజుల్లో, మా అమ్మ ఇంటి దగ్గరే ఉండి, నేను వెళ్ళే సరికి నాకు అన్నీ చేసి పెడుతుంది అని గొప్పగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది.

అజ్ఞాత చెప్పారు...

Change must come from within. However hard you try if the change does not come within your friend, there is nothing anyone can do. Hope this helps.

అజ్ఞాత చెప్పారు...

అటు అత్తగారు, ఇటు తల్లి ఉద్యోగస్తులైతే ఆ అమ్మాయి ఇంట్లో ఉండడం ఆమెకి ఇష్టమైనా, తల్లి అత్తగారిలో ఆమె పట్ల ఏదో చులకన, ఆమె తమకు సహాయంగా పనులు చేసితీరాలన్న డిమాండ్స్, అక్కా చెల్లెలు, ఆడపడుచుల హేలన మాటలు, నీకేం పని అన్నట్టు వాళ్ళు చూసే చూపులు, ఇలా మాటల్లో చెప్పలేని ఇబ్బందులు ఎన్నో ఉన్నాయండి. అందరు తెల్లవారగానే ఉరుకులు పరుగులుతో వెళుతుంటే తాను పనికిరాని మనిషిలా రోగిష్టిలా ఇంట్లో ఒంటరిగా వున్న భావన.
మీరు చెప్పిన ఆ మీ ప్రెండ్ అత్త ఉద్యోగం చేసే రోజుల్లో ఈ ఇబ్బందులు ఆమెకి ఎదురై వుండవచ్చు కదా. ఆమె ఉద్యోగం మానలేదే. ఏం ఇప్పుడు కోడలి కోసం ఇప్పుడైనా మానేసి ఇంట్లో మనవరాలిని కనిపెట్టుకుని ఉండొచ్చుగా.

గుప్పెడు మనస్సు చెప్పారు...

@అజ్ఞాత గారు,

మీరు చెప్పినదానితో నేను ఏకీభవించలేను....కారణం....కీర్తన వాళ్ల అమ్మగారు ఉద్యోగం చెయ్యరు....ఇక పోతే, కీర్తన ఆడపడుచులు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ ఎవ్వరూ వర్క్ చెయ్యరు....అందరూ గృహినిలే, ఎవ్వరూ జాబు చెయ్యటం లేదు అని చులకన చెయ్యరు.....

ఇంక పోతే, వాళ్ళ అత్తగారు, వర్క్ చెయ్యటం మానేసి మనవరాలిని చూసుకోవచ్చు కదా అంటున్నారు....ఆవిడ కి ఇంక రెస్ట్ వద్దా....ఎప్పుడూ పిల్లలు, మనవలు అంటూ వాళ్ళతో పరుగులు పెట్టాలా....ఈ వయస్సు లో ఆవిడ కి ఏది తృప్తి నిస్తుందో అది చెయ్యనివ్వాలని నా ఉద్దేసయం.....

కన్నా కూతురి కోసం, ఉద్యోగం మానెయ్యాలని కీర్తకే అనిపించనప్పుడు, వాళ్ళ అత్తగారు ఎందుకు మానెయ్యాలి...

అజ్ఞాత చెప్పారు...

అదేనండీ మరి. అప్పటివాళ్ళు పిల్లలని అత్తగారి దగ్గరో తల్లి గారి దగ్గరో వదలకుండానే ఉద్యోగాలు చేశారంటారా! ఇప్పటి అమ్మాయిలకు కనీసం ఆ వెసులుబాటు కూడాలేదు. చిరాకు పడే తల్లులూ, జీవితమంతా శమించాం అని నిట్టూర్పులు విడిచే అత్తగార్లు. మమ్మల్ని ఎలాగూ సరిగా చూసుకోలేదు మా పిల్లలనయినా చూడారా అనే బాధ! పిల్లలని ఒంటరిగా వదిలేయలేని కొత్త తరం సున్నిత నమనస్సులు(ఇది మాత్రం నిజమండి పూర్వం తల్లి దండ్రుల కంటే పిల్ల పట్ల ప్రేమా కేర్ ఇప్పటి అమ్మాయిలు అబ్బాయిలకే ఎక్కువ) తల్లి దండ్రులతో పాటు దాదాపు 23 ఏళ్ళుగా ఇంటి పట్టున ఉండటమంటే తెలియని అమ్మాయిలు. ఒకవేళ వుండాలనుకున్నా పోటీ ప్రపంచంలో చుట్టూ ఉన్న వారి మధ్య తమ అమ్మాయిని పెద్ద హోదాలో చూసుకోవాలనుకునే తల్లి దండ్రుల తాపత్రయాలు, తరమటాలు. ఉదయం 8 నుండీ 8 వరకూ బడి, ఆతరువాత ర్యాంకుల పంట పండించే కాలేజీల మధ్య జీవితం. అన్నేళ్ళుగా ఆ జీవితం ఎందుకని ఒక్కసారిగా పెళ్ళవగానే మార్చుకోమని ఒత్తిడి పెడతారు?
రోగిష్టిలా ముసలి దానిలా ఇంట్లో కూర్చుని ఉండడానికా ఆమె 23 ఏళ్ళపాటు బైట ప్రపంచంలో తిరిగింది! అన్నింటికీ ట్రైనింగులు ఉన్నాయ్ కాని పెళ్ళయే వరకు ఇదిగో తరువాత జీవితం ఇలా ఉంటుంది అని ఎవరూ కనీసం చర్చించరు. అప్పటికే అన్నింట్లో పండిపోయినట్టు అలవాటు లేని వంట మొదలు, సొసైటీలో వాళ్ళూ ఇంట్లో వాళ్ళూ నీతులు మొదలు పెడతారు. ఏ పొరపాటు దొర్లినా ఆడదానివేనా అన్నట్టు ప్రవర్తిస్తారు.
పిల్లల పట్ల కేరింగ్ పోషణ భాద్యత ఒక్క తల్లిదేనా? ఆమెకి ఒక్కసారిగా జైలు జీవితం ఎందుకు? కొంత భారం తగ్గించే ప్రయత్నం చేయవచ్చుగా.
ఐనా పిల్లలకు ప్లే స్కూలు వయసు రెండున్నర సంవత్సరాలు. ఒక్కరే తల్లితో కంటే కొద్ది గంటలు పిల్లలతో గడపడమే వారికి మంచిది. తల్లికి కాస్త పర్సనల్ స్పేస్ అనేది ఉండాలి.
ఐనా ఆవిడ వ్యక్తిగత సమస్యలేమిటో బయట ఉండి మనం మీరు ఎలా జడ్జి చేస్తున్నారు. ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని చక్కగా పెంచే వాళ్ళున్నారు. ఏమీ చేయకుండా ఇంటిపట్టున ఉండీ పిల్లలకు రోజూ లంచ్ బాక్స్ లో మ్యాగీ పెట్టే వాళ్ళూ వున్నారు.
ఎవరి శక్తి సామర్ధ్యాలు, ఎవరి కంఫర్ట్ జోన్ బట్టి వాళ్ళు జీవితాలు అమర్చుకుంటారు.
మనకోణంలో అందరినీ పోస్ట్మాట్రం చేయడమెందుకని!

కామెంట్‌ను పోస్ట్ చేయండి