17, మార్చి 2010, బుధవారం

ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులా?

ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులా? అంటే కొన్ని సార్లు అవును అనిపిస్తుంది. అది తెలుగు ఆడవాళ్ళ? భారతీయ స్త్రీలా? లేక ఎవరైనా కావచ్చా అంటే ఎవరైనా కావచ్చు అనిపిస్తుంది కొన్ని సార్లు. ఇది కేవలం నా అభిప్రాయం మరియు స్వానుభవం. ఇది నా చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనల ఆధారం గా రాస్తున్నాను.

మొదటి సంఘటన నేను స్కూల్ లో ఉన్నప్పుడు, మాకు కొంత మంది male టీచర్స్, కొంత మంది female టీచర్స్ ఉండేవారు. అందరూ కాకపోయినా కొంత మంది female టీచర్స్ మార్క్స్ తక్కువ వచ్చినందుకు అమ్మాయిలని ఎక్కువ తిట్టేవాళ్ళు....మాది పల్లెటూరు కావటం, నేను చదువుకున్నది govt . స్కూల్ కావటం తో, అమ్మాయిలు చాలా మంది ఇంట్లో పనులు చేసి, స్కూల్ కి వచ్చేవారు. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని తిట్టేటప్పుడు ఒక్కసారైనా, ఇంట్లో అంట్లు తోముకుని, వంట చేసుకో నీకు ఎందుకు స్కూల్ అని అనకుండా....ఒక్క female టీచర్ తిట్టటం ఆపేవారు కాదు. Volley బాల్ ఆడేటప్పుడు కూడా, బాల్ ని లిఫ్ట్ చేసేటప్పుడు అరచేయ్యికి తగిలిందా.....వెంటనే, పిడకలు చరిచినట్టు కాదు ఆడటం అంటే అనేది.

తరవాత, ఇంజనీరింగ్ చదివే రోజుల్లో, మా ఇంగ్లీష్ లెక్చరర్ అబ్బాయిలతో మాట్లాడేటప్పుడు ఎంతో సౌమ్యం గా, next paragraph నువ్వు చదువు నాన్న అనేది.....అమ్మాయిలని....నువ్వు చదువు అంటుంది అంతే. ఆవిడ same to same Happydays మూవీ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా చేసిన కమిలిని ముకర్జి లాగానే మాట్లాడుతుంది, నడుస్తుంది.....మూవీ చూసినప్పుడు ఆవిడనే చూసినట్టు ఉండేది నాకు.

ఇలాంటివి ఇంక ఒకటి రెండు చూసాను కానీ ఎప్పుడూ ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అని మాత్రం నేను ఇప్పుడు అనుకోలేదు. ఇంజనీరింగ్ అయ్యాక, మొదటి సారి ఒక కార్పోరేట్ కంపెనీ లో ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను. వ్రాత పరీక్ష, రెండు మౌకిక పరీక్షలు పాస్ అయ్యి, ఫైనల్ లెవెల్ ఇంటర్వ్యూ కి వెళ్ళాను. అక్కడ ఒక లేడీ ఉన్నారు. నేను ఏమి భయపడలేదు.....ఉద్యోగం నాకు ఇంక వచ్చినట్టే అన్నా కాన్ఫిడెన్సు తో ఉన్నాను. ఆవిడ నన్ను రెండే రెండు ప్రశ్నలు అడిగింది......ఒకటి క్లైంట్ కి సంబంధించినది.రెండవది నాకివ్వబోయే జాబు రోల్ గురించి. నాకు తెలుసున్నంతవరకు నేను బానే ఆన్సర్ చేసాను. కానీ జాబు రాలేదు. నేను చాలా భాద పడ్డాను. ఎందుకో తెలుసుకోవాలని ప్రయత్నించాను. చివరికి తెలిస్నది ఏమిటి అంటే, ఆవిడ అసలు వాళ్ల పై వాళ వరకూ నా కేసు వెల్లనివ్వకుండానే నా resume డ్రాప్ చేసేసింది. కారణం తెలియదు. మొత్తం ఆవిడ దగ్గరికి ఇంటర్వ్యూ కి వెళ్ళిన వాళ్ళం 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఆ ఒక్క అబ్బాయికి జాబు వచ్చింది.

తరువాత ౩ నెలలకి మరో పెద్ద MNC కి ఇంటర్వ్యూ కి వెళ్ళాను మళ్ళీ, ఇంటర్వ్యూ కి పిలిచినా వాళ్ళలో టాప్ 10 లో ఉన్నాను. ఇంటర్ వ్యూ pannels కూడా 8 ఉనట్టు ఉన్నాయి....నా ప్లేస్ 6 . అన్ని pannels విడివిడి గా ఒక్కొక్క అద్దాల గది లో ఉన్నారు. మొదట ఉన్న పది మంది ని random గా ఒక్కొక్కళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు....నేను మళ్లీ ఒక single లేడీ ఉన్న ప్యానల్ కి వెళ్ళాను. కొంచెం భయం వేసింది...మళ్ళీ ఇలా వచ్చాను ఏంటి అని, మొత్తానికి బానే చేసి బయటకి వచ్చి చూసేసరికి నా తరువాత ఆవిడ దగ్గరికి వెళ్ళటానికి ఒక Q ఉంది, మొత్తం 20 మందిలో, 3 అబ్బాయిలు. మిగతా అందరూ అమ్మాయిలే. నేను result కోసం వేచి చూడాలని అనిపించలేదు.....కానీ అసలు ఎంత మంది సెలెక్ట్ అయ్యారో చూడాలని ఉంటె, ౩ అబ్బాయిలు సెలెక్ట్ అయ్యారు....ఒక్క అమ్మాయ్ కూడా సెలెక్ట్ అవ్వలేదు. మిగతా pannels దగ్గర అమ్మాయిలు కూడా బానే సెలెక్ట్ అయ్యారు. నేను ఆ రోజూ మొదట సారి చిరాకు పడ్డాను.

తరువాత, మళ్ళీ USA వచ్చాక డ్రైవింగ్ లైసెన్సు కోసం వెళ్లి నప్పుడు, ఓ హో మన భారతీయులే కాదు, ఈ అమెరికన్లు కూడా దీనికి ఏ మాత్రం తీసిపోరు అనుకున్నాను. నాకు ఇండియా లో డ్రైవింగ్ వచ్చు. International permit కూడా ఉంది. కాబట్టి నేను రోడ్ టెస్ట్ ఇవ్వకుండానే లైసెన్సు పొందటానికి అర్హురాలిని. కానీ మళ్ళీ నా దురదృష్టం నన్ను వెంటాడి ఒక లేడీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను. నా పేరు పెద్దది అవ్వటం వల్ల నా పాస్ పోర్ట్ లో ఉన్న పేరు కి, నా డ్రైవర్స్ లైసెన్సు మీద పేరుకి కొంచం తేడా ఉండటం వల్ల ఆవిడ ఇండియన్ లైసెన్సు rejected అని రాసేసి, రోడ్ టెస్ట్ ఇవ్వమని చెప్పి పంపించింది. సరేలే నాకు వచ్చు కదా అనుకుని, వెళ్ళాను.....కానీ నా badluck అక్కడ కూడా లేడీ ఆఫీసర్ ఉంది....నేను రోడ్ టెస్ట్ ఫెయిల్..... కారణం 35 MPH రోడ్ లో 25 లో వెళ్తూ, ట్రాఫ్ఫిక్ న్యూసెన్స్ చేస్తున్నానని. మళ్ళీ నెల రోజుల తరవాత ఈ సారి ఇలా కాదు అని, వేరే DMV లొకేషన్ కి వెళ్ళాను.....రామేశ్వరం వెళ్ళినా శనీస్వరం పోలేదని, అక్కడ మళ్ళీ లేడీ ఆఫీసర్ సిద్దం, అప్పటికే, నేను సైకలాజికాల్గా భయం పెట్టుకున్న కారణం గా, కొంచెం వణుకుతూనే డ్రైవ్ చేసాను. మళ్ళీ ఫెయిల్....కారణం, stop sign దగ్గర complete స్టాప్ కి నేను రాలేదని, రోల్ ఓవర్ స్టాప్ అని.

ఇంక నాకు లైసెన్సు వద్దు అనుకుని, ఒక 2 నెలలు మళ్ళీ వెళ్ళలేదు. కానీ అవసరం కదా....తప్పక మళ్ళీ వెళ్ళిన రోజూ, ఒక లేడీ ఆఫీసర్ రెడీ గా ఉంది....అయ్యో భగవంతుడా, అనుకుంటుండగా,  ఆమెకి ఫోన్ రావటం, ఆమె లోపలి వెళ్ళటం, వేరే ఆఫీసర్ రావటం జరిగి మొత్తానికి నేను టెస్ట్ పాస్ అయ్యి, లైసెన్సు తెచ్చుకునా....

తరవాత ఇంక ఎప్పుడూ, ఎక్కడికి వెళ్ళినా, అంటే షాప్ లోనో, పెట్రోల్ bunk లోనో, బ్యాంకు లోనో, చివరికి ఇండియా లో కర్రెంట్ బిల్ కట్టనికి, రైల్వే రిజర్వేషన్ కూడా, ఆడవాళ్ళూ ఉన్నదగ్గరికి అస్సలు వెళ్ళను.


30 కామెంట్‌లు:

Malakpet Rowdy చెప్పారు...

LOL ... ఇలాంటిదే నాకు "జిం" / "జేంస్" అనే పేరుతో అనుభవం. నేను పని చేసే చోట జిం అనేవాడూ ఉన్నా, కొత్తగా వచ్చి చేరినా నా బ్రతుకు బస్ స్టేండే. అప్పటిదాకా సక్రమగా జరుగుతున్నవన్నీ ఈ జిం రాగానే అపభ్రంశపు పనులౌతాయి.

Anil Dasari చెప్పారు...

ఆడవారిపై మీకున్న అభిప్రాయం మీ వ్యక్తిగతం కాబట్టి దాన్ని గురించి వ్యాఖ్యానించను. అమెరికాలో మీ డ్రైవింగ్ లైసెన్స్ అనుభవాల గురించి మాత్రం రెండు ముక్కలు.

ఆ రెండు సార్లూ ఆడవారి స్థానంలో మగవాళ్లు వచ్చినా మీరు తప్పే ఉండేవారు. మీ రెండు ప్రయత్నాల్లోనూ మీ తప్పుల కారణంగానే పరీక్ష తప్పినట్లు తెలిసిపోతుంది కదా. దానికా ఆడ ఆఫీసర్లని నిందించటమెందుకు?

ఇండియాలో ఇంటర్నేషల్ డ్రైవింగ్ పర్మిట్ ఉంటే ఇక్కడ రోడ్ టెస్ట్ అవసరం లేదని మీవరు చెప్పారో తెలీదు కానీ అది తప్పు కావచ్చు (ఈ రూల్స్ రాష్ట్రానికో రకంగా ఉంటాయి కాబట్టి ఈ విషయం గట్టిగా చెప్పలేను. భుత్, ఈ'ం సురె, ఛలిఫొర్నీ రెqఉఇరెస్ ఎవెర్య్బొద్య్ తొ పస్స్ థె రోద్ తెస్త్). నాకు తెలిసినంతవరకూ చాలా రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ పర్మిట్‌తో మీకు మహా ఐతే మూడు నాలుగు నెలల కోసం తాత్కాలిక లైసెన్స్ ఇస్తారు. శాశ్వత లైసెన్స్ కావాలంటే రోడ్ టెస్ట్ ఇవ్వాల్సిందే. If you think about it, it actually makes perfect sense. ట్రాఫిక్ నిబంధనలు, డ్రైవింగ్ కండిషన్స్, వేగాలు, రోడ్ల పరిస్థితి, వగైరా, వగైరా విషయాల్లో ఇండియాకీ, అమెరికాకీ .. ఆ మాటకొస్తే ఏ రెండు దేశాలకైనా హస్తిమశకాంతరం తేడా ఉంటుంది. అలాంటప్పుడు - మీరు ఇండియాలో ఎంత గొప్పగా బండి నడిపినా ఇక్కడ పద్ధతులు నేర్చుకోకుందా ఎకాఎకీ రోడ్డెక్కేస్తే బోల్తా పడరా? ఇంటర్నేషనల్ పర్మిట్ ఉన్నంత మాత్రాన ఫ్రీ-పాస్ ఇవ్వకపోటానికి కారణమదే.

Anil Dasari చెప్పారు...

Oops .. పై వ్యాఖ్యలో ఆ భూత ప్రేత పిశాచాల పేలుడులా ఉన్న ముక్క ఇదీ:

But, I'm sure, California requires everybody to clear the road test).

శరత్ కాలమ్ చెప్పారు...

నాకు మాత్రం ఆడ బాసుల దగ్గర పనిచేయ్యాలంటే భయ్యం. మగ బాసులే హాయి.

Malakpet Rowdy చెప్పారు...

Abracadabra, I think shez talkin' about it in a lighter vein, aint she?

About the road test waiver - If you have the license from the other state some states require you to take the written test but waive the road test if you want to transfer your license. I am not sure whether you are interpreting that as a waiver for international permit.

If you were really serious about women rejecting the women candidates ( I assume you were just kidding ) then I must say you have the wrong perspective.

పానీపూరి123 చెప్పారు...

@అబ్రకదబ్ర
> California requires everybody to clear the road test
Thats not true, for DL transfer only written exam is enough

గుప్పెడు మనస్సు చెప్పారు...

@అబ్రకధబ్రా

మీరు చెప్పిన దానితో నేను ఏకీభవిస్తా....నేను తప్పులు చేసినందుకే ఫెయిల్ అయ్యాను.....కాకపోతే, 35 రోడ్ లో 25 లో వెళ్తున్నాఅని ఫెయిల్ చెయ్యటం సిల్లీ అనిపించింది.....ఒక్క లేడీ ఆఫీసర్ కూడా కొంచెం నవ్వుతూ విష్ చెయ్యలేదు.

ఇంక పోతే, మేము ఉన్న స్టేట్ లో ఇండియన్ లైసెన్సు ఉంటె valid , నేను USA వచ్చిన వెంటనే ఏమి లైసెన్సు అప్లై చెయ్యలేదు.....1 year అన్ని రూల్స్ అర్థం చేసుకున్నాకే వెళ్ళాను. కానీ మీరు చెప్పినట్టు రోడ్ టెస్ట్ లేకుండా లైసెన్సు ఇవ్వటాన్ని నేను కూడా సమర్ధించను. నేను రోడ్ టెస్ట్ ఇచ్చాను కాబట్టి అనుకోవద్దు, నేను కొంత మందిని చూసి అలా అనుకున్నా.....

అజ్ఞాత చెప్పారు...

మా ఆవిడదీ ఇదే కత, ఓ ఆడామే టెస్ట్ లో, తను వచ్చే కారు చూసి, కొంచం ముందే బ్రేక్ వేసింది అని లైసెన్స్ ఇవ్వలేదు.
తను అప్పుడు ఇదే మాట అంది, చచ్చినా ఆడోళ్ల దగ్గర మాత్రం టెస్ట్ తీసుకోను అని :)

Anil Dasari చెప్పారు...

@పానీపూరీ:

Agreed.

My 'everbody' applies only to foreign license holders :-)

అజ్ఞాత చెప్పారు...

అభినందనలు. అంటే అమెరికాలో స్త్రీ రిజర్వేషన్ల ద్వారా అప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ పొందేశారన్న మాట!
ఈ మానవ సంభంధాలున్నాయి చూశారు - లింగభేధాలే కాక మనకు కావలసిన విధంగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ - తొక్క రంగు , దేశ, ప్రాంతీయ, భాషా, యాసా, ఆచార, మత, కుల, అంతరకుల , దిశా ( ఒకేదేశంలో నార్థ్ , సౌథ్, ఈస్ట్ , వెస్ట్) , ఉత్తర, ద్క్షిణార్ధగోళాలు కూడా భేధాలు వాటి కాంబినేషన్లు అనుకూల విశ్లేషణ చేసుకోవచ్చును - మీ టేలంట్ తప్ప!
అభినందనలు, :)

శంకర్

Vasu చెప్పారు...

@ అబ్రకదబ్ర - సరిగ్గా నేను చెబుదామనుకున్న మాట చెప్పారు. కాలిఫోర్నియా లైసెన్స్ గురించి.

@ Malak - "I think shez talkin' about it in a lighter vein, aint she?"

అలా అనిపించలేదు. చాలా సీరియస్ గా ఉంది పోస్ట్

Vasu చెప్పారు...

@ మలక్, గుప్పెడు మనసు - టైటిల్ చూసి ఇదేదో బ్లాగుల్లో జరుగుతున్నా గొడవల గురించి ఏమో అని ఆశక్తి గ వచ్చా :) నిరాశ పరిచారు :):)

Malakpet Rowdy చెప్పారు...

హీహీ శంకర్

ఇండియానాలో టెస్ట్ తీసుకున్నావా?


వాసూ,

అంతేనంటారా?

Malakpet Rowdy చెప్పారు...

అన్నట్టు మొదటిసారి నన్ను ఫెయిల్ చేసింది కూడా స్త్రీనే :)) అత్యుత్సాహం చూపించి బేకప్ చేసేడప్పుడు రాంగ్ టర్న్ తీసుకున్నా.

Malakpet Rowdy చెప్పారు...

షాంబర్గ్ లో ఆవిడకి చాలా చెడ్డ పేరుందని తరవాత తెలిసింది. రెండోసారి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నతను మొదటి టెస్టు గురించి అడిగి ఆవిడ పేరు చెప్పగానే జాలిగా చూశాడు నాకేసి :))

Vineela చెప్పారు...

hehhe..mee lage nakkuda oka lady officer 35 lo 25 speed lo veltunna ani fail chesindandi. but neneppudu ala lady officer kavalani fail chesindi anukoledu. may be u are right ;) naah just kidding. adavallaki adavallu satruvulu avuno kado teliyadu kani ma office lo oka colleague natho takkuva matladutundi but migata colleagues(obv. Guys) andaritonu chala chala matladutundi. May be that's what I perceive of her emo ani lite tesukuntanu. as a female, nenu abbayilu tesukunnanta easy ga konni vishayalani tesukonu. may be that's our characteristic :D also..indian boss daggara cheyyakudadu anedi general ga vunde feeling. indian boss gallu chala pani cheyinchukuntaru. peddaga appreciaiton vundadu. dani gurinchi mee opinion enti.

సోదరి చెప్పారు...

అయితే మీరు కూడా ఇంకొంతమంది ఆడ వాళ్ళకు అన్యాయం చేస్తారన్నమాట.ఆడవాళ్ళకు ఆడవాళ్ళు శత్రువులుకదా :).

అజ్ఞాత చెప్పారు...

అబ్బే మీరు మరీ ఒక వైపు నుండే రాస్తున్నారు. మరో వైపు అస్సలు ఆలోచించడం లేదు. మగాడికి మగాడు అయినంతగా ఆడవాల్లకి ఆడవాల్లు శత్రువులు అవ్వలేరేమో అని నా అభిప్రాయం. ఒక పెద్దాయన (వివరాలు చెప్పడం నాకు ఇష్టంలేదు) తన దగ్గర పని చేసే ఆడవాల్లందరినీ "ఏమ్మా బంగారు తల్లీ" అంటూ ఆప్యాయంగా పిలవడమే కాదు, మాతో పోలిస్తే వారికి తక్కువ పని అప్పగించేవాడు. నా చిన్నప్పుడు ఇంగ్లీషు పధ్యాలు బట్టీ పట్టి చెప్పేవాల్లం. అందులో అబ్బాయిలకు అమ్మాయిలకు పోటీ. మా ఇంగ్లీషు మాష్టారు న్యాయ నిర్ణేతగా వ్యవహరించేవారు. ఒకరోజు మేము ఓడిపోయాం, అప్పుడు అమ్మాయిలంతా తెగ వెక్కిరించారు. ఇక చూడండి, మా అందరికీ రోషం పొడుచుకొచ్చి, బాగా చదివి, మిగితా వాల్లను కూడా చదివించి మరీ నెగ్గం. కానీ, మాష్టారు మాత్రం అమ్మయిలను గేలిచేయకండి అంటూ అర్డరు వేసి వెల్లాడు. మరి అంతకు ముందు రోజు వారిని వారించలేదెందుకు అని బాధ. ఇలాంటివి చాలానే వున్నాయి లెండి.

అజ్ఞాత చెప్పారు...

స్కూలు టీచర్లు (ముఖ్యంగా గత తరం వరకు) ఆడవాళ్ళు చాలాముటుకి శాడిష్ట్ గా ఉంటారు. పబ్లిక్ తో సర్వీస్ చేయాల్సిన ఉద్యోగాల్లో జనం ఊరుకోరుకాబట్టి కాస్త సౌమ్యంగా ఉంటారేమో ఇక్కడ స్కూళ్ళలో చిన్నపిల్లపై మాంచిగా తమ ప్రతాపం చూపుతారు లేడీ టీచర్లు. కారణాలు సొంత ప్రస్టేషన్స్ వాళ్ళపై చూపడం, ఓపిక లేకపోవడం. ఉద్యోగం చేసేఆడవాళ్ళకి ఓపిక చాలా తక్కువగా ఉంటుంది. రక్తహీనత, ఇంట్లో గలాటాలూ అలాంటివి ఇంకొన్ని కారణాలై ఉండవచ్చు.
ఇప్పటి అమ్మాయిలు చాలా బెటర్ గా ఉన్నారండి. (జెలసీల సంగతి పక్కనుంచితే :))
పాత తరం వాళ్ళకి ఇంకొక సమస్య కూడా. ప్రపంచంలో ఆడవాళ్ళంతా సుఖపడిపోతుంటే తాము మాత్రం ఇంట్లో బయట పనిచేయావలసి వస్తుందన్న సెల్ఫ్ పిటీ అప్పట్లో. నిజం చెప్పుకోవాలంటే వాళ్ళపై బాద్యతలు ఎక్కువ. ఇక్కడ ప్రత్యేక సౌకర్యాలు తక్కువ.

మీరింకా ప్రభుత్వ Maternity ఆసుపత్రిలలో జరిగే దారుణాలు చూసివుండరు. అక్కడ ఆడవాళ్ళే నర్సులు డాక్టర్లు డెలివరీకి వచ్చిన పేద ఆడవాళ్ళతో ప్రవర్తించే తీరు ట్రీట్ చేసే తీరు మాటాడే మాటలు భయంకరంగా ఉంటాయి.

స్నేహాల విషయానికి వస్తే. ఎందుకనో ఆడవాళ్ళు ఒకరి వెనుక ఒకరు బాగా చాఢీలు (లూస్ టంగ్?)మాట్లాడుకుంటారు. జీవితంలో ఒకరు ఇద్దరికి మించి మంచి స్నేహితులు దొరకరు పరిచమయిన మిగతా అందరూ జలసీనో మరేదో కారణంగానో వెనక గోతులు తవ్వుతూనే ఉంటారు.

కొందరు ఓ 45 ఏళ్ళు దాటిన 50 వర్కింగ్ ఆడవాళ్ళు మరీ భయంకరంగా ఉంటారు. వాళ్ళని పట్టేవాళ్ళే ఉండరు. ఇంటా బయట రచ్చ రచ్చ చేస్తుంటారు.
సహజంగా ఆడవాళ్ళలో ప్రేమ దయ జాలి ఎక్కువంటారు! బయట ప్రపంచంతో పోటీ మొదలయ్యాక వాటి స్థాయిలో మార్పు తప్పక ఉంది.

మంచు చెప్పారు...

అడాళ్లకి ఆడాళ్ళు, మగాళ్లకి మగాళ్ళు శతృవులా కాదా అన్నది తెలీదు కానీ.. సాదారాణంగా ఆడబాసుల దగ్గర పనిచెయ్యడం కస్టమట :-) .. నా ప్రస్తుత మేనజర్ లేడినే కానీ చాలా మంచిది.. క్రిస్టమస్ గిఫ్ట్లు, మంత్లి లంచ్ లు ఆవిడ సొంతడబ్బుతొనే ఇస్తుంది మరి..

అమెరికాలొ ఏ రాస్ట్రం లొ అయినా డ్రైవింగ్ లైసెన్స్ కి రోడ్ టెస్ట్, రాత పరిక్షలు కంపల్సరి. ఇంటర్నెష్నల్ పర్మిట్ అసలు వేలిడ్ కాదు. ఒరిజినల్ ఇండియన్ లైసెన్స్ ఇంగ్లిష్ లొ కాకుండా లొకల్ లంగ్వెజ్ లొ వుంటే అది తర్జుమా చెయ్యడనికే ఆ పర్మిట్. ఒక్క పెర్మిట్ వుంటె చెల్లదు. పెర్మిట్ తొ పాటు లైన్సెస్ వుంటేనే వేలిడ్.. ఇండియన్ లైసెన్స్ ఇంగ్లిష్ లొ వుంటె ఈ పెర్మిట్ అవసరం లేదు.

కాలిఫొర్నియా రూల్స్ మరీ దారుణం .. Interstate DL ట్రాన్స్ఫర్ కి కూడా రిటన్ టెస్ట్ ఇవ్వాలట.. మా మాసాచుసెట్ట్స్ లొ అలా వుండేది కాదు..

అజ్ఞాత చెప్పారు...

ఆడ వారు సాధారణంగా పర్ఫెక్షనిస్ట్లు కావటం కారణంగా స్ట్రిక్ట్ గా ఉంటారేమో!
అదీ ఆడవారి పట్ల ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉండచ్చు.
మగ వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు. ఆడవాళ్ళు పర్ఫెక్టు గా ఉండాలనే భావ జాలానికి ఆడవాళ్ళు కూడా దాసులేకదా
అందుకే ఇంట్లో కూడా అమ్మాయి నే అమ్మ ఎక్కువ భయపెడుతుంది అమ్మ కూడా. మనమన్నా మారదాం.

అజ్ఞాత చెప్పారు...

@Manchupallaki,

Nope, You are wrong! States like New Mexico, Oklahoma and couple of more will give direct licence (with out any sort of test) if you produce a valid international driver license. I have seen couple of cases ended up with accidents luckily not a great damage physically with that sort of licenses and Indian sort of driving. And many of the states at least ask for the written test to clear when transferring driver license from a different state this is to let them know about state laws!

And for the author of this blog, It appears to be silly(25Mph when limit is 35Mph) but it is the rule. what if some one behind you assume that you are accelerating to the speed limit and approach you, but you retain lower speeds which might be a possible accident.

My comment may be slightly off topic, I just wanted to share a piece of information

గుప్పెడు మనస్సు చెప్పారు...

@మలక్ గారు,

మీరు చెప్పి నట్టు నేను lighter వే లోనే చెప్పా....i am not much serious aboout it ...
అయినా ఇవి అప్పుడప్పుడూ, జరిగిన వాటి గురించి రాసినది.....నిన్న gym కి ఒక కొత్త దేశి అమ్మాయ్ వచ్చింది. ఆమెకి treadmil ఎలా స్టార్ట్ చెయ్యాలో తెలియకపోతే, అడిగింది...నేను చెప్పను....కానీ ఆమెకి స్టార్ట్ చెయ్యటం రాలేదు....వచ్చి మళ్ళీ పక్కన నుంచుని నన్ను చూస్తూ ఉంటె, నాది pause చేసి, అమ్మేది స్టార్ట్ చేసి వచ్చాను.....కనీసం థాంక్స్ చెప్పలేదు. అప్పుడు ఈ ఆలోచనలు వచ్చి ఇంటికి రాగానే పోస్ట్ చేసాను అంతే......

పానీపూరి123 చెప్పారు...

> 35 రోడ్ లో 25 లో వెళ్తున్నాఅని ఫెయిల్ చెయ్యటం సిల్లీ అనిపించింది.
it's not silly.... the samething happened for me also

గుప్పెడు మనస్సు చెప్పారు...

@వినీల,

మీరు చెప్పిన ఇండియన్ బాస్ ల గురించి నేను ఏకీభవిస్తా....నాకు ఇలాంటి exp అయ్యింది.....ఇండియన్ బాస్ లే కాదండి......ఇండియన్ కంపెనీ లలో మరీ ఎక్కువ.....వాడు ఏదో మనకి favor చేస్తునట్టు చెప్తాడు అన్నీ, క్లైంట్ దగ్గర తీసుకునే రేట్ కి మన బిల్లింగ్ రేట్ కి సంబంధమే ఉండదు.....పైగా చిన్న hike ఇచ్చి....ఏదో బంపర్ ప్రైజ్ ఇచ్చినట్టు చెప్తాడు....

మా ఆఫీసు లో కూడా ఒక అమ్మాయ్, అమ్మయలతో ఒకలా, అబ్బాయలతో ఒకలా మాట్లాడుతుంది...మా వారి ఆఫీసు లో కూడా అంతే...

గుప్పెడు మనస్సు చెప్పారు...

@సోదరి గారు,

ఇప్పటికి నేను అలా కాను, నేను ఎప్పుడూ భయపడుతూ ఉంటా, నేను వేరే కొంత మంది ని తిట్టుకునట్టు, వాళ్ళు నన్ను కూడా తిట్టుకున్తరేమో అని....డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ భయం చాలా ఉంటుంది నాకు, ఈ దేశిలందరూ ఇంతే, డ్రైవింగ్ సరిగ్గా రాకుండా, కార్ తీసుకుని రోడ్ ఎక్కేస్తారు అని అనుకుంటారేమో అని.....

గుప్పెడు మనస్సు చెప్పారు...

@ఆకాశరామన్న గారు,

మీరు చెప్పినదానితో ఏకీభవిస్తా, సాధారణం గా అమ్మాయిలని మేల్ టీచర్స్ ఎక్కువ తిట్టరు, కారణం వాళ్ళు ఇంటికి వెళ్లి మాస్టారు తిట్టరు అంటే ఎక్కడ వాళ్ళ నాన్న గొడవకి వస్తాడేమో అని, ఆడపిల్లని తిడతావ అని.....ఆడపిల్లని తిట్టటం చాలా sensetive matter పల్లెటూర్లలో....ఏమి తిడితే, ఏమి అర్థం తీస్తారో అని.....

మొన్న మాకు తెలిసిన ఒక స్కూల్ లో ఒక అమ్మాయిని లెక్కల మాస్టారు, ఆదివారం మా ఇంటికి రా నీ doubts clarify చేస్తా అన్నారట....ఆయాన అంటే పడని ఇంకో మాస్టారు, దానికి పెదార్థం తీసి, ఆయన మీద ఆ అమ్మాయ్ చేత లైంగిక వేదింపులు కేసు పెట్టించాడు..... అదీ సంగంతి....

గుప్పెడు మనస్సు చెప్పారు...

మిగతా అందరు చెప్పినట్టు, నేను తప్పులు చేసిన కారణం గానే, ఫెయిల్ అయ్యాను....కానీ కొంత కాలానికి, లేడీ ఆఫీసర్ అంటే సైకాలోజికాల్ గా భయం పెట్టుకున్నా.....

sunita చెప్పారు...

మీరు నా కంటె బెటరు. నేను కొంచం పొట్టి. కంగారులో సీట్లో పిల్లొ లేకుండా టెస్ట్ ఇవ్వడానికి వెళ్ళాను, ఇంకా టర్నింగ్ కూడా తీసుకోలేదు ఆరంజ్ కోను పడిపోయింది. కనుక నువ్వు ఫైల్ అంది. ఆ కోను నాకు కనపడకుండా ఎలా పడిపోయిందో అర్ధం కాలేదు. నేను ఇంకా వెర్రి చూపు చూస్తునే, సారీ, నా కలీగ్ కూడా చూసాడు ఆ కోను పడిపోవడం, నిన్ను ఫైల్ చెయ్యాలిసిందే అంది. నన్ను నేను తిట్టుకుని అదే స్పీడులో ఇంటికొస్తూ పక్కనున్న కర్బ్ ను కారుతో తన్ని ఓ $250 మా ఆయనకు వదిలించాను, ఫిల్టర్లు చెడిపోయాయి అన్న కారణంతో.

swapna@kalalaprapancham చెప్పారు...

lady boss la kinda pani cheyadam kashtame :(

కామెంట్‌ను పోస్ట్ చేయండి